నవతెలంగాణ-ముధోల్
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామ శివారులో గల కాశిరాం అనే రైతు పొలంలో మంగళవారం సంపంగి–15048 వరి రకంపై క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు పాల్గొని రైతులకు సంపంగి–15048 రకానికి సంబంధించిన ప్రత్యేకతలు, దిగుబడి లక్షణాలు, వ్యాధి నిరోధకత, తక్కువ కాలంలో పంట పండించే సామర్థ్యం వంటి అంశాలపై వివరంగా రైతులకు అవగాహన కల్పించారు.
కంపెనీ ప్రతినిధులు ప్రవీణ్ రావు,శంకర్ పటేల్ లు మాట్లాడుతూ. సంపంగి రకం రైతులకు అధిక దిగుబడితో పాటు, మంచి ధాన్య నాణ్యతను ఇస్తుందని వారు తెలిపారు. తక్కువనీటివినియోగంతో ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతుందని వివరించారు.ఈకార్యక్రమంలో పలువురు రైతులు, పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.



