Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట రూరల్
రైతులు సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించి భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అధిక ఆదాయం పొందాలని శాస్త్రవేత్తలు సూచించారు. శుక్రవారం సూర్యాపేట మండలంలోని కేసారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA)” కార్యక్రమం ద్వారా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు సి.హెచ్. నరేష్ మరియు ఎ. నరేష్ పాల్గొని రైతులకు ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి విధానం, పచ్చిరొట్ట ఎరువుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమి సారాన్ని పెంచడంతో పాటు మానవ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించవచ్చని తెలిపారు. రైతులు సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ ఆదాయం పెంచే పంటలను ఎంచుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి కాలుష్యానికి గురవుతుందని, దీని వల్ల భవిష్యత్తులో దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అందువల్ల రైతులు ప్రకృతి మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వైపు మొగ్గు చూపాలని సూచించారు. అలాగే గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో రైతుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు, విస్తరణ కార్యకలాపాలు మరియు రైతులకు అందుబాటులో ఉన్న ఉత్పత్తుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి. కృష్ణ సందీప్, వ్యవసాయ విస్తరణ అధికారి బి. ముత్తయ్య, సర్పంచ్ రేఖ రమణతో పాటు రైతులు తాటికొండ జానకిరాం రెడ్డి, యాతం సతీష్ రెడ్డి, వెన్న శ్రీనివాస్ రెడ్డి, మెంథబోయిన నాగయ్య, రేఖ సతీష్, తండు మంగ, బత్తుల నాగమణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -