Sunday, January 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులూ.. తస్మాత్ జాగ్రత్త.!

రైతులూ.. తస్మాత్ జాగ్రత్త.!

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో నిత్యం విష పాములు, కొండచిలువలు సంచారం చేస్తున్నాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలని రైతులకు పడంపల్లి, నాగల్ గావ్ గ్రామాల రైతులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలోని పడంపల్లి, నాగల్ గావ్ గ్రామాలలో శనివారం రాత్రి సమయంలో రైతులు మక్క చేనులో నీరు పెట్టేందుకు కాలిన నడకన వెళ్తున్న రైతులకు గ్రామాలలోని పంట పొలాలలో భారీ కొండచిలువలు తారసపడ్డాయి. ఈ ఘటన పడంపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.

రైతులు తెలిపిన వివరాల ప్రకారం పడంపల్లి గ్రామ శివారులోని ఓ రైతు మక్క చేనులో నీరు పెట్టేందుకు వెళుతున్న క్రమంలో భారీ కొండచిలువ కనిపించడంతో భయాందోళనకు గురై పక్క చేనులో  ఉన్న రైతులను ఫోన్ ద్వారా సమాచారం అందించి పిలిపించుకొవడం జరిగింది. పెద్ద భారీ కొండ చిలువను రైతుకు మరో రైతు చూపించాడు. దానిని చూసినా రైతులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అదేవిధంగా ఇంకో  రైతు నాగల్ గావ్ గ్రామ బైపాస్ రోడ్డు పై వాహనంపై వెళ్తున్న క్రమంలో రాత్రి సమయంలో ఇంకో కొండచిలువ పాము దారసపడింది.

భయాందోళనకు గురైన రైతు వెంట వస్తున్న ఇంకో వాహనదారుడికి చూపించడంతో దాన్ని చంపేందుకు యత్నించారు. కానీ తప్పించుకొని  వెళ్ళిపోయిందని తెలిపారు. అందుకే రైతులు రాత్రిపూట వ్యవసాయ పనులకు వెళ్తన్న క్రమంలో జాగ్రత్తగా కాళ్లకు తొడుగులు వేసుకొని వెళ్లాలని, కచ్చితంగా టార్చిలైట్ చేతిలో ఉండే విధంగా మరియు కట్టే ఉంచుకొని వెళ్లాలని రైతులకు పైన చెప్పిన  గ్రామాల రైతులు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -