-పని సులువైనా..వెన్నంటే ప్రమాదాలు..
-రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలోని అన్ని గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైయ్యాయి. ఈ ఏడాది వానకాలంలో సాగు చేసిన వరి చేతికి రావడంతో రైతులు పంట కోతలు మొదలు పెట్టారు. ప్రస్తుతం గ్రామాల్లో వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోతలు గంటల్లోనే పూర్తి అవుతున్నాయి.రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. పంట కోసే సమయంలో రైతులు, యాజమానులు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. యంత్రాల ద్వారా పని సులువుగా పూర్తవుతున్నాయి.పనులు చేసే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి. పంట కోసే సమయంలో పొలాల్లో విద్యుత్ లైన్లు ఉంటాయి. హార్వెస్టర్లకు ఆ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ట్రాక్టర్లలో ధాన్యం తీసుకెళ్లే సమయలో, గడ్డి కట్టలు తరలించేటప్పడు విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉంది. అజాగ్రత్తగా ఉంటే వాహనాలతో పాటు ప్రాణాలకు ప్రమాదం తప్పదని అధికారులు సూచిస్తున్నారు.
యాజమానులు, డ్రైవర్లు జర భద్రం
యాజమానులు హార్వెస్టర్ నడిపే డ్రైవర్, సహయకుడిపై మొత్తం భారం వేసి ఉండవద్దు.
కోతకు పొలంలోకి వెళ్లేటప్పుడు ఇరువైపులా దారి సక్రమంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి.
పొలాల్లో చేతికందే ఎత్తులో చాలా చోట్ల విద్యుత్ తీగలు ఉంటాయి. ముందుగానే గమనించి జాగ్రత్తలు పాటించాలి.విద్యుత్ స్తంభాలకు దూరం నుంచి హార్వెస్టర్‌ను నడపాలి.పొలంలో విద్యుత్ తీగలు ఉంటే ముందుగా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి కోత పూర్తయ్యే వరకు సరఫరా నిలిపి వేయించాలి.
అన్న దాతలు అప్రమత్తంగా ఉండాలి…
ఏఓ సందీప్ రెడ్డి (పెద్దవూర)
ప్రస్తుత కాలంలో కూలీల కొరతతో రైతులు యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.రైతులకు కొన్ని గంటల్లోని ధాన్యం చేతికి వస్తుంది. యంత్రాలతో ఎంత సమయం ఆదా అవుతుందో,ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రమాదాలకు చోటు ఇచ్చిన వాళ్ళు అవుతారు.కొన్ని చొట్ల భూమి తడిగా ఉండడంతో పొలం కోసే సమయంలో వరి కోత యంత్రాలు దిగబడే అవకాశం ఉంటుంది.కాబట్టి చేతులతో కూలీల సహయంలో ఆ వరి పంటను కోపి కుప్పగా వేస్తారు.చేతులతో వరి పంట దుబ్బులు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి అందులో వేయాలి.
లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.రైతులు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ట్రాక్టర్‌లో వరి ధాన్యం తీసుకవెళ్ళెటుప్పుడు,వరి గడ్డి కట్టలు తీసువెళ్ళెటప్పుడు విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉంది.పంట పోలలలో పని చేస్తున్నప్పుడు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.ఏలాంటి అనుమానలు ఉన్నా విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందిస్తే వెంటానే విద్యుత్ సరాఫరను నిలిపివేస్తారు.ప్రమాదాలు సంభావించకుండా ఉంటుంది.



