నవతెలంగాణ – జన్నారం
ప్రకృతి వ్యవసాయంతో రైతులకు అధిక లాభం కలుగుతుందని జన్నారం మండల వ్యవసాయ శాఖ అధికారి అంజిత్ కుమార్ అన్నారు. మంగళవారం పోనకల్ పట్టణంలోని రైతు వేదికలో NMNF (నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫామింగ్) పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం వలన సాగు ఖర్చు తగ్గడం, భూమి సారాన్ని పెంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడం, భూమి సారవంతంగా ఎండిపోకుండా ఉండడం, పర్యావరణాన్ని కాపాడడం వలన రైతులు అధిక లాభాలు పొందుతారని అన్నారు.
ఇట్టి పథకంలో ధర్మారం, చింతలపల్లి మరియు లింగయ్యపల్లె గ్రామాలకు సంబంధించిన 125 ఎకరాలు మరియు 2 సంవత్సరాల పాటు ఇట్టి పథకంలో భాగమైన రైతులకు ప్రోత్సాహకాలు, ప్రకృతి సాగులో పాటించాల్సిన పద్ధతులు, మెళకువల గురించి తోడ్పాటు అందించటం జరుగుతుంది. అలాగే జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా యాభై శాతం రాయితీ పై వచ్చిన వేప నూనెను రైతులకు అందించటం జరిగింది. వేప నూనె కావలసిన రైతులు మీ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని తెలుపటం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మల్యాల త్రిసంధ్య ,దివ్య, సయ్యద్ అక్రమ్, లవన్ అధిక సంఖ్యలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.



