- Advertisement -
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక లో నిర్వహించిన కిసాన్ కాప్ అవగాహన సదస్సు ను మండల రైతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సీసీఐ రా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని పేర్కొన్నారు. నిరక్షరాస్యులైన రైతుల వద్ద స్మార్ట్ఫోన్లు లేవని, మారుమూల గ్రామాలకు సిగ్నల్లు సైతం సరిగా రావడం లేదని వాపోయారు. స్లాట్ బుకింగ్ విధానంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని బజార్ హత్నూర్ వ్యవసాయ అధికారికి రైతులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
- Advertisement -