నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని మలక్ చించోలి గ్రామానికి చెందిన దాసరి పవన్ రైతు బిడ్డ గ్రూప్-3 రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించారు. దాసరి రమణయ్య వ్యవసాయం, లక్ష్మీ బీడీలు చుట్టూతు కుమార్తె ప్రసన్న, కుమారుడు పవన్ కుమార్ ను చదివించారు కుమార్తె ప్రసన్న ఇటీవల డీఎస్సీ లో టీచర్ ఉద్యోగం సాధిందించింది. కుమారుడు పవన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం టీజీపీ ఎస్సీ గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన జాబితాను ప్రకటించింది. మొదటి ప్రయత్నంలో నే ఈ విజయం సాధించినట్లు పవన్ తెలిపారు.
గ్రూప్-2 లో ఒక్క మార్క్ తో ఉద్యోగం కోల్పోగా గ్రూప్ 3 లో హైదరాబాద్ లోని టీజీపీ ఎస్సీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తుల తోపాటు మండల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.



