Sunday, August 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉత్తమ్‌తో రైతు కమిషన్‌ భేటీ

ఉత్తమ్‌తో రైతు కమిషన్‌ భేటీ

- Advertisement -

– చెెరువులు, కుంటల పరిరక్షణ, గ్రౌండ్‌ వాటర్‌ పెంపునకు చర్యల ప్రతిపాదన
– త్వరలో రైతు కమిషన్‌ సమావేశం
– మంత్రికి ఆహ్వానం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో రైతు కమిషన్‌ భేటీ అయ్యింది. కమిషన్‌ చైర్మెన్‌ ఎం. కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్‌, గడుగు గంగాధర్‌, భవానీరెడ్డి ఈ భేటీలో ఉన్నారు. ఇప్పటి వరకు రైతు కమిషన్‌ చేసిన కార్యక్రమాలను వివరించడంతోపాటు రాష్ట్రంలో చెరువులు, కుంటల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై మంత్రికి కమిషన్‌ పలు సూచనలు చేసింది. మైనర్‌ ఇరిగేషన్‌ కింద ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణకు వెంటనే నీటి నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా నీటి సంఘాలు ఉన్న అంశాన్ని గుర్తుచేసింది. గ్రామీణ స్థాయిలో రైతులు సంఘటితమై చెరువులను కాపాడుకునే వారనీ, అయితే గత పదేండ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్న చెరువులు కుంటలు అన్యాక్రాంతమయ్యాయని వివరించింది. కొన్ని చోట్ల కబ్జాదారులు ఆక్రమించి లే ఔట్లు వేయడం, నీటివనరులకు వచ్చే క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో భారీగా కాల్వలు దెబ్బతినడం, మాయమవడం జరిగాయని వివరించింది. ప్రధానంగా చెరువులు కుంచించుకుపోవడం, గ్రౌండ్‌వాటర్‌ లెవల్స్‌ పడి పోయినట్టు కమిషన్‌ చెప్పింది. రాష్ట్రంలో చెరువులు కాపాడుకోవడానికి సమగ్ర విధానం అవసరమని రైతు కమిషన్‌ అభిప్రాయ పడింది. ఆ విధానాన్ని కమిషన్‌ తయారు చేయ నున్నట్టు తెలియజేసింది. నిపుణు లతో విధాన పత్ర తయారీకి ప్రత్యేక సమా వేశం కోసం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పింది. దీనికి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హాజరుకావాలని కమిషన్‌ కోరింది. కమిషన్‌ ఆహ్వానానికి మంత్రి ఉత్తమ్‌ సానుకూలంగా స్పందించినట్టు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -