సొసైటీ బిల్డింగ్ ముందు ధర్నా
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఉప్పల్వాయి గ్రామంలో యూరియా కోసం సొసైటీ భవనం ముందు రైతులు సోమవారం ఆందోళన చేపట్టి నిరసన తెలిపారు. రైతులకు యూరియా సరఫరా కాకపోవడం, 420 బస్తాలు మాత్రమే ఉండడంతో, ఉప్పల్ వాయి, గిద్దె గ్రామస్తులతోపాటు పోసానిపేట్, మోషన్ పూర్, రంగంపేట, రెడ్డిపేట రైతులు రావడంతో దాదాపు 1000 మంది రైతులు వరుసలో నిలబడడంతో రైతుకు ఒక సంచి యూరియా బస్తా కూడా అందని పరిస్థితి ఉన్నందున, మరో లోడు వచ్చేవరకు యూరియాను పంపిణీ చేయవద్దని, ఒక్కో రైతుకు రెండు బస్తాలు యూరియా అందించాలని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వరి పంట పొట్టదశ దాటి పోతుందని, దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడే యూరియా సరఫరా చేయాలని రైతులు సొసైటీ భవనం ముందు ఆందోళన చేపట్టి, ధర్నా నిర్వహించారు. పోలీసుల బందోబస్తు మధ్య కాసేపు నిరసన తెలపడంతో, మరోలోడు త్వరలో తెప్పించి రైతులకు యూరియా అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
యూరియా కోసం రైతుల ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES