Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వందన పాఠశాలలో ఘనంగా రైతు దినోత్సవము 

వందన పాఠశాలలో ఘనంగా రైతు దినోత్సవము 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండల కేంద్రంలోని వందన పాఠశాలలో మంగళవారం రైతు దినోత్సవం కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకున్నారు. విద్యార్థులు రైతుల వేషధారణలో పంటలు పండించడం పద్ధతులు విధానాలు ధాన్యాన్ని మార్కెట్లో విక్రయిస్తున్న విధానం నారు పోయడం నాటు వేయడం ఎరువులు కలుపు మందులు వాడే విధానం  కళ్ళకు కట్టినట్టుగా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత వ్యవసాయ సంక్షోభం లో రైతు పరిస్థితి ఏంటి అని రైతులు ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు వాటి నుంచి రైతులు బయటకు రావడానికి మనో ధైర్యాన్ని కల్పించే విధంగా పాఠశాల కరస్పాండెంట్ డి సంతోష్ రెడ్డి విద్యార్థులచే చక్కగా నటింపజేశారు. రైతు వ్యవసాయం పాడి పరిశ్రమ వంటి రంగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -