Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు

యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు

- Advertisement -

– రాత్రి ఒంటిగంట నుండి లైన్ లో ఉంటున్న రైతులు 
– ఒక్క సంచి కోసం ఎన్ని కష్టాలో అంటున్న రైతులు 
– పోలీస్ స్టేషన్లో పంపిణి
నవతెలంగాణ –  కామారెడ్డి 

బిబిపేటలో రైతులకు నూతన ఉరవడిని సృష్టించారు. కని విని ఎరగని రీతిలో పోలీస్ స్టేషన్లో రైతులకు యూరియా కోసం టోకెన్లను పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బీబీపేట్ సొసైటీ వద్ద మల్కాపూర్, తుజాల్పూర్, జనగామ తదితర గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం బిబిపేట సొసైటీ వద్ద రాత్రి నుండి  పడి  గాపులు కాశారు.  అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీబీపేట మండల కేంద్రములో శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బీబీపేట లో యూరియా సరైన సమయంలో అందకపోవడం వల్ల  రైతులు రాత్రనక పగలనక యూరియా కోసం సొసైటీల వద్ద లైన్లు కడుతూ నిరీక్షిస్తున్నారు. అయినప్పటికీ వారికి సరిపడా యూరియా అందడం లేదు. శనివారం ఉదయం బిబిపేట సొసైటీ వద్ద సుమారు 700 మంది మహిళలు, పురుషులు రైతులు  వేచి చూచి చివరికి పోలీసులు వచ్చి వారి ఆధ్వర్యంలో యూరియా పంపిణీ వస్తే ఆన్లైన్లో జరుగుతాయని ఉద్దేశంతో రైతులను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో టోకెన్లు ఇచ్చారు.

పోలీసులతో వాగ్వాదానికి దిగిన రైతులు 
ఎన్ని గంటలు లైన్లో వేచి చూడాలని యూరియా ఇస్తే వెళ్లిపోతామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రైతులకు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఎస్సై ప్రభాకర్ రైతులను సముదాయించి పోలీస్ స్టేషన్లో ఇస్తామనిపేట పోలీస్ స్టేషన్ కు రైతులను పిలిపించి టోటల్ అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -