వెల్దండలో పోలీస్ పహారాలో యురియా పంపిణీ..
నవతెలంగాణ – వెల్దండ
రోజుల తరబడి వేచి ఉన్న వెల్దండ మండలంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సోమవారం వెల్దండ మండల కేంద్రంలోని ఆగ్రో సెంటర్లో రైతులకు కావాల్సిన యూరియా ను నిర్వాహకులు పోలీస్ ప్రహార లో పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతు వేలిముద్రల ఆధారంగా ఒక యూరియ సంచి రైతులకు అందజేశారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే సమకూర్చి రైతులకు అందజేయాలని పలువూరు రైతులు కోరారు. సరైన సమయంలో పంటలకు యూరియా అందిస్తే పంట దిగుబడి పెరుగుతుందని సకాలంలో యూరియా అందాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావాల్సిన యురియాలో తెప్పించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని పలు రైతులు కోరారు.
రైతులకు తప్పని యూరియా కష్టాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES