ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు
నవతెలంగాణ – మిరుదొడ్డి
తాజాగా సంభవించిన తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరంతర వర్షాలు, బలమైన గాలులతో పంటలు నేలపాలయ్యాయి. గ్రామాల్లో మక్కజొన్న, పత్తి, వరి పంటలు అధికంగా నష్టపోయారు. రైతులు ఆరుకాల కష్టపడి పండించిన వరి పంట పొలాల్లో వర్షానికి నీరు ఎక్కువగా నిల్వ ఉండడంతో రైతులు పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వారి ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయాలని కోరారు. రైతులు ఆర్కాల కట్టించి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో వర్షానికి నష్టపోవడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవున్నట్లు రైతులు తెలిపారు.
రైతులు విత్తనాలు, ఎరువులు, నీటి ఖర్చులు పెట్టి ఎంతో కష్టపడి సాగు చేసిన పంట ఒక్క రాత్రిలో నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే నష్టాన్ని అంచనా వేసి, తగిన పరిహారం అందించాలని వారు కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలను సందర్శించి, నష్టపరిధిని అంచనా వేస్తున్నట్లు సమాచారం. అయితే రైతులు మాత్రం తక్షణ సాయం లేకుంటే అప్పుల భారం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నష్టపోయిన పట్టాలను పరిశీలించి రైతులకు పరిహారం అందే విధంగా చూడాలన్నారు.
తుఫాన్ ప్రభావంతో రైతన్నల కష్టాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



