Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్పంటకు బీమా ఉంటేనే రైతులకు ధీమా

పంటకు బీమా ఉంటేనే రైతులకు ధీమా

- Advertisement -

పరామర్శలు కాదు రైతులకు భరోసా కల్పించాలి
ఎమ్మెల్యే పాయల్ శంకర్
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్

రైతులు సాగు చేసే పంటలకు బీమా ఉంటేనే రైతులు ధీమాగా వ్యవసాయం చేసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇలాంటి విపత్కర సమయాల్లో పాలకుల పరామర్శ కాకుండా మానవతా దృక్పథంతో రైతులకు భరోసా కల్పించాలని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గత మూడు, నాలుగు  రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను విస్తృతంగా పరిశీలించిన అనంతరం బుధవారం ఎమ్మెల్యే క్యామ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు… రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు 10,000 ఇస్తే ఎలాంటి లాభం లేదని మిగతా విత్తనాలను సబ్సిడీలో అందించాలని సూచించారు.

అదేవిధంగా కోతకు గురైన భూములను చదును చేసుకునేందుకు ఎన్ఆర్ఈజీఎస్ ను అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పై భారం పడకుండా ఉండేదని,  రైతులకు సైతం ఇలాంటి ఇబ్బందులు తప్పేవని అన్నారు. ఇప్పటికే రైతులు 70 నుండి 80 శాతం వరకు పెట్టుబడులు పెట్టారని, సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో శాశ్వత పరిష్కారానికై చర్యలు చేపట్టాలని అన్నారు ఈ  సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, జోగు రవి, లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, దినేష్ మాటోలియా, సంతోష్ రాకేష్, దయాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad