Friday, October 24, 2025
E-PAPER
HomeNewsఅల్పపీడనంతో రైతుల గుండెల్లో దడ.!

అల్పపీడనంతో రైతుల గుండెల్లో దడ.!

- Advertisement -

వర్షంతో పత్తి, వరిపై ప్రభావం
నవతెలంగాణ – మల్హర్ రావు

వరుణుడు రైతులకు దడ పుట్టిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మండలంలో గురువారం 4.5 మీ.మీటర్లు, శుక్రవారం 6.8 మీ.మీటర్ల వర్షపాతం నమోదైంది.దీంతో చేతికొచ్చిన పత్తి,వరి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వానాకాలంలో సాగైన పంటలకు ప్రస్తుత వానలు ప్రతికూలంగా మారుతున్నాయి. అన్ని పంటలు కలిపి 22.550 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో వరి 15.500 వేల ఎకరాల్లో,పత్తి 3.500 వేల ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుతం పత్తి పంట చేతికందుతోంది.ఈ సమయాన వర్షంతో పంట నేలవాలుతోందని, కాయలోకి నీరు చేరి రంగు మారుతోందని ఆవేదన చెందుతున్నారు. అసలే దిగుబడి పడిపోగా, ఇప్పుడు రంగు మారడంతో మద్దతు ధర దక్కే అవకాశం లేదని చెబుతున్నారు. అలాగే వరి కోతలు కొన్ని గ్రామాల్లో మొదలుపెట్టారు.మరికొన్ని గ్రామాల్లో వరి పొట్ట దశ నుంచి కోత దశకు చేరడంతో తాజా వర్షాల కారణంగా కోతలు వాయిదా వేస్తున్నారు. ఇక 2వేల ఎకరాల్లో వేసిన మిర్చి తోటలకు ఈ వాతావరణం ప్రతికూలంగా మారుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -