కలిసిరాని వానాకాలం సీజన్
యాసంగి సాగుకు సన్నద్ధం
నవతెలంగాణ – మల్హర్ రావు
వానాకాలం కలిసి రాకపోవడంతో రైతులు రబీ సాగుపైనే ఆశలు పెట్టుకున్నారు. వానాకాలం సీజనల్లో అతివృష్టితో పత్తి,వరి ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక ఆర్థికంగా నష్టపో యారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు రైతులు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. రబీలోనైన కాలం కలిసివస్తుందని ఆశతో సాగుకు సన్నద్ధం అవుతున్నారు.ఈ ఏడాది మండల వ్యాప్తంగా 14.050 వేల ఎకరాల్లో రబీ సాగుకానున్నట్లు అధికారులు అంచన వేశారు.ఇందులో 50 మొక్కజొన్న,14 వేల ఎకరాల్లో వరి పంటలు సాగు చేయనట్లుగా తెలిపారు.ఇందుకు యూరియా 50 మెట్రిక్ టన్నుల యూరియా,80 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, వారంలో ఎంటియు 1010,కెఎన్ఎం118 వరి సబ్సిడీ విత్తనాలు అందుబాటులోకి వస్తాయని మండల వ్యవసాయ అధికారి శ్రీజ తెలిపారు.
రబీపైనే రైతుల ఆశలు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



