Saturday, March 7, 2026
E-PAPER
Homeజిల్లాలురైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి

రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి

- Advertisement -

– కల్లూరి మల్లేశం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్ 

రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆలేరు సీపీఐ(ఎం) మండల కార్యాలయంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను ఎన్నికల కోడ్ పేరుతో ఆలస్యం చేశారని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

వెంటనే నిధులను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలలో మహిళలకు ఇస్తామని చెప్పిన రూ.2500లను వెంటనే అమలు చేయాలని, గత మూడు సంవత్సరాలుగా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అర్హులైన ప్రతి పేదకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను అధ్యయనం చేస్తూ మార్చి 8 నుంచి మార్చి 31 వరకు ఇంటింటికి సీపీఐ(ఎం) కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మండల కార్యదర్శి సభ్యులు సూదగాని సత్యరాజయ్య, జూకంటి పౌల్, నల్ల మాస తులసయ్య, పిక్క గణేష్, శంకర్ రావణ్, చౌడబోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -