Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం రైతన్నలు ఎదురుచూపులు

కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం రైతన్నలు ఎదురుచూపులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ప్రభుత్వం రైతన్నలకు ఆదుకునేందుకు సోయా పంట మద్దతు ధర కేంద్రాలు ఏర్పాటు కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. సోయా పంటకు ప్రభుత్వ మద్దతు ధర రూ.5328 ఉండగా ప్రైవేటు ధర రూ.4200 పలుకుతుంది. ప్రభుత్వ ధరకు ప్రైవేటు ధరకు రైతన్న ప్రతి క్వింటాలుకు రూ.1100 మోసపోవలసి వస్తుంది. ఈపాటికి రైతన్న భారీ వర్షాలు మూలంగా పంటలు నష్టపోయి దిగుబడి రాకుండా పోగా ఎంతో కొంత చేతికి వచ్చిన పంటకు మద్దతు ధర లభించక దళారుల చేతుల్లో మోసపోవలసి వస్తుందని సోయా పంట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరదల మూలంగా దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అనుకూలిస్తే ఎకరానికి 10 క్వింటాళ్లు పండేదని తెలిపారు. భారీ వర్షాల మూలంగా పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయి, ఎకరానికి మూడు క్వింటాళ్లు 4 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోందని వాపోయారు. ప్రభుత్వం రైతులకు ఆదుకునేందుకు సోయా పంట మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -