Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతులను వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కించాలి

రైతులను వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కించాలి

- Advertisement -

– ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత
– రెండేండ్లలో రైతుల సంక్షేమంపై
కాంగ్రెస్‌ సర్కారు దృష్టి : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ చిన్నారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కురుకుపోయిందని రాష్ట్రప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ జి చిన్నారెడ్డి తెలిపారు. తద్వారా రైతులు అప్పుల ఊబిలో కూరుకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సిచువేషన్‌ అసెస్మెంట్‌ సర్వే 2018-19ను కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్‌ ఠాగూర్‌ వెల్లడించారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఒక్కొక్క రైతు కుటుంబంపై తలసరి అప్పు 1.52 లక్షల ఉందని తెలిపారు. రైతుకుటుంబానికి నెల ఆదాయం జాతీయ సగటు రూ.10,218 అయితే, తెలంగాణలో రైతు కుటుంబ తలసరి ఆదాయం రూ 9,403 మాత్రమే ఉందని తెలిపారు. రాష్ట్రంలో రైతు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుని ఆదాయం పొందేందుకు కూరగాయల సాగు, డైరీ ఫామ్‌, కోళ్లు, గొర్రెల పెంపకం, ఆయిల్‌ ఫామ్‌, సెరికల్చర్‌, పప్పు దినుసులు వంటి ప్రత్యామ్నాయ పంటల మార్గాలను అనుసరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించాలని కోరారు. ప్రణాళిక బద్ధంగా కార్యాచరణను రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 91శాతం మంది రైతులు అప్పుల ఊబిలో ఉండడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. రెండేండ్లుగా వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌ రెడ్డి అనేక చర్యలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -