అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం..
ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
రైతులు ఇచ్చిన ధాన్యానికి రసీదు ను కచ్చితంగా ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశించారు. బుదవారం ఇందల్ వాయి మండలంలోని వెంగల్ పాడ్ (పాటితండా) లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం విక్రయించుకునేలా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.
ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి, ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తుందని, నిజామాబాద్ జిల్లాలో గత ధాన్యం కొనుగోలు ఐకెపి ఆధ్వర్యంలో 100 సెంటర్ ఇస్తే, ప్రస్తుతం 200 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకెపి కేంద్రాలకు అప్పజెప్పిందన్నారు. గత ధాన్యం కొనుగోలు సందర్భంగా ఐకెపి మహిళలకు కోటి రూపాయల లాభం వచ్చిందని, ఈసారి 200 ఐకెపి కేంద్రల వల్ల మహిళలకు సుమారు రెండు కోట్ల రూపాయల లాభం వస్తుందని అంచనా వేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారని, ఇప్పటికే వారి కోసం పెట్రోల్ బంకులు రైస్ మిల్లులు బస్సులు తదితర వాటికి రుణాలను అందజేస్తూ అందజేస్తూ ఇచ్చిన మాట నిలుపుకుంటున్నారని పేర్కొన్నారు.
ధాన్యం సేకరణలో ఎటువంటి అవకతవకలు జరగకూడదని ఐకెపి అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇందల్ వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్,సహకార సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చింతల కిషన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిన్ రెడ్డి సంతోష్ రెడ్డి, తాహసిల్దార్ వెంకట్రావు, ఎంపీడీవో అనంతరావు, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ కుమార్, ఐకెపి ఎపిఎం సునిత, సి సి లు ఉదయ్ కుమార్, స్వప్నా,రుణేంద్ర, ఎంఎస్ అధ్యక్షురాలు శ్యామల,విఓఎ అధ్యక్షురాలు అరుణా, బుక్ కిశోర్ శ్రీనివాస్, రేణు బాయి, తోపాటు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.