Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు ఏఈఓ వద్ద పంటనష్ట దరఖాస్తులు చేసుకోవాలి..

రైతులు ఏఈఓ వద్ద పంటనష్ట దరఖాస్తులు చేసుకోవాలి..

- Advertisement -

మండల వ్యవసాయ అధికారి సిద్ధి రామేశ్వర్..
నవతెలంగాణ – రెంజల్ 

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో సుమారు 33% పంట నష్టం జరిగిన రైతులు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారుల వద్ద దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సిద్ధిరామేశ్వరి పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం రాదని అపోహలు సృష్టించారని, అలాంటిదేమీ లేదని నష్టపోయిన రైతులు తమ పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, మొబైల్ ఫోన్ నెంబర్లను తీసుకొని వారి వద్ద దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. క్రాప్ డామేజ్ కి, కొనుగోలు కేంద్రానికి ఏలాంటి సంబంధం లేదని, నష్టపోయిన ప్రతి రైతు అర్హులేనని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -