తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – హలియా
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో రైతు భరోసా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నేటికీ వడ్ల బోనస్ అందించకపోవడం దారుణమని తక్షణమే అందించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాలియాలో కొత్తపల్లి పిఎసిఎస్ చేస్తున్న ఇబ్రహీంపేట కొనుగోలు సెంటర్లో పరిశీలించి రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొలుగొని కేంద్రానికి వచ్చి వారం రోజులు దాటిన బస్తాలు రాకపోవడం కాంటాలు కాకపోవటం పట్టాల ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి వడ్ల బోనస్ ఇంతవరకు అందలేదని ఇప్పుడు ఇస్తానన్న బోనస్ ఎప్పటిక అందుతుందని రైతులు ఆందోళన వ్యక్తపరిచారు. రైతులకి మూడు కార్లు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలను అశ్రయిస్తూ అదనపు వడ్డీలకు తెచ్చుకొని అతివృష్టి అనావృష్టితో పంటలు పూర్తిగా నష్టపోయి పీకల్లోతు అప్పుల్లో కూలిపోయారని అన్నారు.
నేడు ఎకరానికి 40 వేలు ఖర్చు వస్తున్న దిగుబడి మాత్రం 30 నుంచి 35000 వచ్చిందని కౌలు రైతులు ఎకరానికి 30000 నష్టపోయారని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి తక్షణమే ఎకరానికి రూ.50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలుచేసి రైతులను ఆదుకోవాలని తక్షణమే బకాయిగా ఉన్న రైతు భరోసా బోనసులను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులను ఇచ్చి రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ఐకెపి వారు సెంటర్లను గుర్తించి అడుగున సిసి ఏర్పాటు చేసి ప్రభుత్వమే పట్టాలని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాస్ రెడ్డి వెంకటయ్య రాములు అంజమ్మ వెంకటమ్మ లక్ష్మమ్మ తదితరులు ఉన్నారు.



