నవతెలంగాణ-చండ్రుగొండ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో నిర్మించనున్న సీతారామ ప్రాజెక్ట్ ఉప కాలువ నిర్మాణ సర్వేను రైతులు బుధవారం అడ్డుకున్నారు. మద్దుకూరు శివారు నుంచి అయన్నపాలెం, చండ్రుగొండ గ్రామాల మీదుగా ఉపకాలువ చెరువుల మీదుగా వెళ్ళనుంది. తమ విలువైన భూములు ఆగమౌతున్నాయని అయన్న పాలెం గ్రామానికి చెందిన రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న కాలువ నిర్మాణం విభాగం డీఈ నాగేశ్వరరావు, ఏఈ గణేష్ అక్కడికి చేరుకున్నారు.
రైతులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, తుమ్మలపల్లి సురేష్ ఆధ్వర్యంలో రైతులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. కాలువ పాత డిజైన్ ప్రకారం పనులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు అధికారులు ఫోన్ ద్వారా సమస్యను తెలిపారు. మెజార్టీ రైతుల అభిప్రాయం మేరకే కాలువ పనులు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి కాలువ సర్వే చేయాలని, వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రితోపాటు ఎమ్మెల్యే ఫోన్‌లో హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
సీతారామ ఉపకాలువ నిర్మాణ సర్వేను అడ్డుకున్న రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



