Saturday, November 1, 2025
E-PAPER
Homeకరీంనగర్పంట నష్ట పరిహారం చెల్లించాలని రైల్వేలైన్ కట్టపై రైతుల నిరసన

పంట నష్ట పరిహారం చెల్లించాలని రైల్వేలైన్ కట్టపై రైతుల నిరసన

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
చెరువుకు గండి పడి పంట నష్టపోయిన రైతులకు రైల్వే కాంట్రాక్టర్ నష్టపరిహారాన్ని అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి బానప్ప చెరువు కు గండిపడి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రామచంద్రాపురం రైతులు శుక్రవారం రైల్వే లైన్ కట్టపై జరుగుతున్న పనులను అడ్డుకొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామ శివారులో ఉన్న బానప్ప కుంట మత్తడి పైనుండి రైల్వే లైన్ పనులు చేస్తున్న మట్టి లారీల రవణ వల్ల మత్తడి చెడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ మత్తడిని మరమ్మతులు చేయాలని పలుమార్లు చేపి చెప్పిన కాంట్రాక్టర్ పెడ చెవిన పెట్టారని మండిపడ్డారు..రెండు రోజుల క్రితం కురిసిన వర్షం వల్ల వానప్ప చెరువు కు గండిపడి వర్షం నీరు రామచంద్రాపూర్ గ్రామ రైతుల పొలాల్లో చేరడమే కాకుండా పంట పొలాల్లో రాళ్ళు, ఇసక మెట్ లు చేరి చేతికందిన పంట రైతులు నష్ట పోయారన్నారు. రైల్వే పనుల సూపర్వైజర్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. వెంటనే బాణప్ప చెరువు ముత్తడి మరమ్మతులు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తూ సూపర్వైజర్ కు వినతిపత్రం అందజేశారు. వారం రోజుల్లోగా మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో పొన్నాల చక్రపాణి, బొడ్డు శ్రీధర్, గడ్డం భాస్కర్ రెడ్డి,గంధం శ్రీనివాస్, పొన్నాల సూరేష్,గందమ్ రమేష్,సందీప్, కొమ్ము పర్శరాములు,సుజాత,బాలయ్య,ఎల్లయ్య చంద్రయ్య బలమల్లు, మహేష్,రాజు,కిష్టయ్య,పారందములు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -