నవతెలంగాణ- శాయంపేట/మహబూబాబాద్
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో రైతు ఆగ్రోస్ కేంద్రం వద్ద రైతులు యూరియా బస్తాకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ప్రగతి సింగారం ఆగ్రోస్ రైతు కేంద్రానికి ఆదివారం 450 బస్తాలు రాగా, అందులో నుంచి 225 బస్తాలు వసంతాపూర్‌కు, మిగిలిన 225 బస్తాలు శాయంపేట ఆగ్రోస్ రైతు కేంద్రానికి తరలించే క్రమంలో వసంతపూర్ గ్రామ రైతులు అడ్డుకున్నారు. ఎస్‌ఐ పరమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని రెండు రోజుల్లో మరో 225 బస్తాలు వసంతపూర్ రైతులకు అందజేస్తామని చెప్పడంతో శాంతించారు. అలాగే మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు రైతు వేదిక వద్ద యూరియా కోసం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యూ లోన్‌లో నిలుచున్నారు.
యూరియా బస్తాకు నిప్పు పెట్టి రైతుల నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES