Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యూరియా కోసం రైతుల ధర్నా..

యూరియా కోసం రైతుల ధర్నా..

- Advertisement -

– రైతాంగానికి సరిపడా యూరియా అందించండి
– ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు సూర నరసయ్య 
నవతెలంగాణ –  కామారెడ్డి

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో సోమవారం రైతులతో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు సూర నరసయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సూర నరసయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో విఫలమయ్యిందని ఆయన అన్నారు. ప్రభుత్వం చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటని ఆయన దుయ్యబట్టారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇంకా యూరియా కొరత తో రైతులను ఇబ్బందులు పెట్టడం సరైనది కాదని ఆయన అన్నారు. రైతాంగానికి సరిపడా యూరియాని అందించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

లేదంటే పెద్ద ఎత్తున ప్రజలతో రైతులతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఎప్పుడు అందిస్తారని ఆయన ప్రశ్నించారు. మది రైతు ప్రభుత్వం అని, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప ప్రజలకు రైతాంగానికి చేసిందేమీ లేదని ఆయన అన్నారు. తక్షణమే రైతులకు సరిపడా యూరియా ను సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని లేదంటే రైతు ఉద్యమం తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు, రైతులు, పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad