Wednesday, February 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయూరియా కోసం రైతుల ధర్నా

యూరియా కోసం రైతుల ధర్నా

- Advertisement -

నవతెలంగాణ-చిన్న శంకరంపేట
సకాలంలో యూరియా అందకపోవడంతో మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేటలోని గవ్వలపల్లి ఎక్స్‌ రోడ్‌ వద్ద రైతులు ధర్నా చేశారు. మెదక్‌ నుంచి చేగుంట వెళ్లే ప్రధాన రహదారిపై రైతులు రోడ్డుపైన భీష్మించుకొని కూర్చున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం వెంటనే యూరియాను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు యూరియా కోసం ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసుకోవడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పట్టా పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు చూసి యూరియాను సరఫరా చేసేవారని తెలిపారు. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న చిన్న శంకరంపేట ఎస్‌ఐ నారాయణ గౌడ్‌ రైతులతో మాట్లాడి ధర్నా విరమింపచేశారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -