Wednesday, November 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలురిజర్వాయర్ నిర్మాణాన్ని నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన

రిజర్వాయర్ నిర్మాణాన్ని నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు 
మండల కేంద్రం సరిహద్దు వ్యవసాయ భూముల్లో ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణ సర్వేను నిరసిస్తూ, బుధవారం భూములు కోల్పోతామన్న రైతులు తహసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో మండలంలోని అనంతవరం, అంబగిరి, మైలారం గ్రామాల రైతులు పాల్గొన్నారు. ‘ రిజర్వాయర్ వద్దు మా భూమిలే ముద్దు’ అంటూ నినదించారు. మీ భూములు సర్వే చేయాలంటూ రైతులకు ఫోన్లు చేస్తున్నారని, ఎవరు చేస్తున్నారో తెలియడం లేదని రైతులు తెలిపారు. రిజర్వాయర్ ను రద్దు చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. సర్వేకు వచ్చిన అధికారులకు సహకరిస్తేనే కదా ఎవరి భూములు ఎన్ని ఎకరాలు కోల్పోతున్నది తెలిసేదని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. వెంటనే రైతులు లేచి.. అసలు సర్వేలు చేయరాదని, ఆయన మాటలను అడ్డుకొని గందరగోళం చేశారు. ఉమామహేశ్వర రేజర్వాయర్ నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఇందుకు సంబంధించిన నిధులను కేటాయించడం జరిగిందని అధికారులు వివరిస్తున్నారు. ఈ నెల 11న హైకోర్టు తీర్పు కూడా ఇచ్చిందని, బాధిత రైతులకు 2013- 16 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వనుందని తెలిపారు. ఏది ఏమైనా రిజర్వాయర్ నిర్మాణం ఇంత దూరం వచ్చాక ఆగదని రైతులు కూడా చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా రైతులను మభ్యపెట్టి రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించడం వినిపించింది. ఈ కార్యక్రమంలో మండల కేంద్రం రైతులతో పాటు ఆయా గ్రామాల రైతులు యువకులు పాల్గొన్నారు.

oppo_2
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -