Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాగునీరు కోసం జాతీయ రహదారిపై రైతుల ధర్నా

సాగునీరు కోసం జాతీయ రహదారిపై రైతుల ధర్నా

- Advertisement -

దేవాదులతో చెరువులను నింపాలని ఆందోళన
నవతెలంగాణ – వర్ధన్నపేట

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఉన్న చెరువును దేవాదుల నీటితో నింపాలని రైతులు ఖమ్మం వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. కట్ర్యాల గ్రామంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని, ఆందోళన చేశారు. దేవాదుల కెనాలి కాలువలు ఉన్నప్పటికీ దేవాదుల కాలువలకు నీరు అందించడం లేదు. దీంతో కెనాల్ కాలువలు ఎండి, బట్టి పేరుకుపోయి శిథిలావస్థకు చేరుతున్నాయి. కానీ సాగునీరు మాత్రం చేరడం లేదని రైతులు అంటున్నారు.

సాగునీరు లేక, చెరువులు నిండక భూములు ఎండిపోతున్నాయని, సాగు చేయలేని పరిస్థితిలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కడారి గూడెం, కట్రియాల గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పందించి, దేవాదుల కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని, తమ పంట పొలాలను సాగు చేసుకునే అవకాశం కల్పించాలని రైతులు పలు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేను, ప్రభుత్వాన్ని, కోరుతున్నారు. కార్యక్రమంలో కుందూరు మహేందర్ రెడ్డి, జడ సతీష్, పింగిలి సంపత్ రెడ్డి, పింగిలి రాజేందర్ రెడ్డి, కడారి గూడెం మాజీ సర్పంచ్ మంద సతీష్, కంజర్ల రంజిత్, కట్టాల కడారి గూడెం గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -