– నెల అవుతున్నా కాంటాలు పెట్టడం లేదని ఆగ్రహం
నవతెలంగాణ-మాడ్గులపల్లి
ఐకేపీ కేంద్రానికి ధాన్యం తెచ్చి నెల రోజులవుతున్నా కొనుగోలు చేయలేదని, వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు శనివారం మాడ్గులపల్లి మండల కేంద్రంలో నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తాము మార్కెట్‌కు ధాన్యం తెచ్చి నెల అవుతోందన్నారు. తేమ శాతం వచ్చినా కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసి మొలకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మాడ్గులపల్లి ఎస్‌ఐ కృష్ణయ్య, ఏసీడీఓ, ఏఓ ఘటనా స్థలానికి వచ్చి అధికారులతో మాట్లాడ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు దేవిరెడ్డి అశోకరెడ్డి, శ్రీకర్, మహిళా రైతు పాదూరి గోవర్ధన, మల్లారెడ్డి, వెంకటరెడ్డి, ముత్తారెడ్డి, మండల దుర్గయ్యతో పాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



