Friday, May 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీలుగ విత్తనాల కోసం రైతుల క్యూ

జీలుగ విత్తనాల కోసం రైతుల క్యూ

- Advertisement -

నవతెలంగాణ-జోగిపేట
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సోమవారం వ్యవసాయ కార్యాలయం ముందు జీలుగ విత్తనాల కోసం రైతులు తమ పట్టాదారు పాసు బుక్‌లను క్యూ లైన్‌లో పెట్టి విత్తనాల కోసం ఎగపడ్డారు. ఉదయం నుంచే రైతులు కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులు రాకముందే భారీ సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకొని క్యూ లైన్‌లో ఉన్నారు. కూపన్ల కోసం రైతులు ఇబ్బందులు పడ్డారు. తమకు దొరుకుతాయో లేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం 300 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -