Wednesday, September 24, 2025
E-PAPER
Homeకరీంనగర్యూరియా కోసం బారులు తీరిన రైతులు

యూరియా కోసం బారులు తీరిన రైతులు

- Advertisement -

నవతెలంగాణ – గన్నేరువరం
మండల కేంద్రం గన్నేరువరంతో పాటు అన్ని గ్రామాల రైతులు యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు. గంటల కొద్ది లైన్ లో నిలబడి వేచి చూస్తే తీరా యూరియా అయిపోయిందని నిర్వాహకులు తెలపడంతో నిరాశతో వెను తిరుగుతున్నారు. గన్నేరువరంకు సోమవారం కేవలం 460 బస్తాలు, హనుమాజీ పల్లెకు 230 బస్తాల యూరియా రావడంతో సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు.

ముందు వరుసలో ఉన్నవారికి యూరియా లభించి, మిగతా వారికి దొరక్కపోయేసరికి నిరాశతో వెనుతిరిగారు. హనుమాజిపల్లి స్టేజి వద్ద సైతం ఇదేవిధంగా క్యూ లైన్ కొనసాగింది. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు అందుబాటులో యూరియా సరైన మొత్తంలో అందుబాటులో ఉంచాలని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గంప వెంకన్న డిమాండ్ చేశారు. ఈ విషయంపై  ఏవో కిరణ్మయిని వివరణ కోరగా.. రైతులు అవసరానికి మించి కొనుగోలు చేయకూడదని, ప్రతిరోజు యూరియా సొసైటీలకు వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -