Saturday, November 1, 2025
E-PAPER
Homeఆదిలాబాద్టోకెన్ల కొరకు ఉదయం నుంచి బారులు తిరిన రైతులు 

టోకెన్ల కొరకు ఉదయం నుంచి బారులు తిరిన రైతులు 

- Advertisement -
  • – టోకెన్ల కోసం వచ్చినఇద్దరు మహిళలు గాయాలు…
    – అర్ద రాత్రి నుంచి వరుసలో పెట్టిన చెప్పులు.
    ..
  • నవతెలంగాణ – కుభీర్ : రైతుల కష్టాలు అన్నో ఇన్నో కాదు ఇక్కడి పరిస్థితి చుస్తే అర్థం అవుతుంది. పంట వేసినప్పటి నుంచి అది చేతికి వచ్చే వరకు రైతులు కష్టాలు పడుతూనే ఉన్నారు. విత్తనలు విత్తినప్పటి నుంచి అది కోతకు వచ్చి ఇంటికి తీసుకువచ్చిన పంటను అమ్ముకోవడానికి కష్టాలు తప్పడం లేదు. మండల కేంద్రమైన కుభీర్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కుఫెడ్ ద్వారాశనివారం నుంచి సొయా కొనుగోళ్లు కేంద్రాన్ని ప్రారంభించి ముందుగా రైతులకు టోకెన్ల కోసం ఉదయం అర్ద రాత్రి  నుంచి బారులు తీరారు. శనివారం నుంచి టోకెన్లు పంపిణి చేస్తామని అధికారులు తెలపడం తో ఉదయం నుంచి రైతులు కార్యాలయం వద్ద టోకెన్ల కోసం వరుసలో  నీళ్లుచున్న ప్పటికీ మండలంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో సొయా రైతులు తరలి రావడంతో క్య లైన్ల పరిస్థితి గందరగోళం గా మారింది. దింతో శంకర సంఘం కార్యాలయం గద్దె వద్ద టోకెన్ల కోసం మహిళా, పురుష రైతులు తోపులాటలో పలువురు మహిళలు కింద పడిపోగా వారికి తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరి కి కళ్ళు విరాగాయి.
  • మరో పది మంది వరకు మహిళా పురుష రైతులకు స్వాల్ప గాయాలియ్యాయి. ఇలా పలు మార్లు జరగడంతో ఒక్కరికీ ఒక్కరు తోసుకోవడం రైతులు కింద పడిపోవడం జరిగింది. పోలీసులు ఉన్నపట్టికి పెద్ద సంఖ్యలో రైతులు టార్లిరావడంతో ఏమి చేయాలో తోచక చేతులు ఎత్యేసిన పరిస్థితి నెలకొంది. ఎస్ ఐ కృష్ణ రెడ్డి ద్వారా సమాచారం అందుకున్న బైంసా రూరల్ సి ఐ నైలు నాయక్ టోకెన్లు జారీ చేసే కేంద్రం వద్దకు చేరుకొని రైతులు టోకెన్ల కోసం తీసుకువచ్చిన జిరాక్స్ పత్రాలను ముందుగా తీసుకోని ఒక్కరిని పీల్చి టోకెన్లను జారీ చేయాలని సూచించాడం తో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైంసా రూరల్ సి ఐ నైలు నాయక్ తో పాటు తహసీల్దార్ శివరాజ్ ఏ ఓ సారిక సహకార సంఘం కార్యదర్శి క్రాంతి కుమార్ తదితర అధికారులకు కుభీర్ తో పాటు మలేగాం, పల్సి, చాత గ్రామాలలో సొయా కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తొమ్మిది వ్యవసాయ క్లస్టర్లలో గల రైతు వేదికల ద్వారా ఏ ఈ ఓ ల తో టోకెన్ల జారీ పక్రియను కొనసాగించాలని వేడుకున్నారు నిర్మల్ జిల్లాలో నే 43 జీపీలు కల్గిన అతి పెద్ద మండలం కుభీర్ కావడం విశేషం. దింతో మండలంలో 76గ్రామాలు ఉండగా 43గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. సుమారు 23వేల ఎకర్లో రైతులు సొయా పంటను సాగుచేశారు.ఈ కారణంగా కనీసం నాలుగు కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు సౌకర్యం కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ దృష్టి సారించి కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసేలా రైతులు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -