Monday, September 29, 2025
E-PAPER
Homeఖమ్మంరైతు భరోసాతో రైతుల హర్షం..

రైతు భరోసాతో రైతుల హర్షం..

- Advertisement -

మంగళవారం మూడు ఎకరాల లోపు  విడుదల….
నవతెలంగాణ – అశ్వారావుపేట
: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించిన రైతు భరోసా – 2025 పధకం పట్ల రైతులు హర్షం ప్రకటిస్తున్నారు. మొదటి రోజు రెండు ఎకరాల సాగు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా ఎకరాకు ఆరువేల రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. అదేవిధంగా మంగళవారం మూడు ఎకరాలవరకు సాగు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా జమ చేసినట్లు వ్యవసాయ శాఖ ఏడీఏ రవికుమార్ తెలిపారు.

అశ్వారావుపేట నియోజకవర్గంలో : మండలం వారీగా రైతులు మరియు రైతు భరోసా మొత్తం ఈ క్రింది విదంగా వున్నాయి.
అన్నపురెడ్డిపల్లి మండలం 3554 మంది రైతులకు రూ.3.07 కోట్లు,
అశ్వారావుపేట మండలంలో 7138 మంది రైతులకు రూ. 6.64 కోట్లు,
చండ్రుగొండ మండలంలో 4681 మంది రైతులకు రూ.3.96 కోట్లు,
దమ్మపేట మండలంలో 6560 మంది రైతులకు రూ.5.87 కోట్లు,
ములకలపల్లి మండలంలో 6416 మంది రైతులకు రూ.6.02 కోట్లు చొప్పున నియోజకవర్గం వ్యాప్తంగా  మొత్తం 48,231 మంది రైతులకు రూ. 91.71 కోట్లు రైతు భరోసా మంగళవారం నాటికి  మొత్తం 28349 మంది రైతులకు రూ. 25.57 కోట్లు జమ అయ్యాయి అని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -