Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొంతా తుఫాన్ కు రైతుల విలవిల 

మొంతా తుఫాన్ కు రైతుల విలవిల 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
మొoథా తుఫాన్ ప్రభావంతో మండలంలో కురిసిన వర్షానికి వరి,పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం శ్రమించి తీరా చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యం తూఫాన్ రూపంలో రైతులను ఆగం చేసింది. చేతికొచ్చిన వరి పంట పలుచోట్ల నేల వాలడంతో రైతులు ఆవేదన తోటి ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ప్రకృతి వైపరీత్యంతో కోత సమయానికి వర్షం కొరియడంతో పత్తి రంగు మారి,దిగుబడి తగ్గి, పత్తి నాణ్యతను దెబ్బతీసి,పంట మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉందని దిగులు చెందుతున్నారు.అంతేకాకుండా తీవ్ర నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పెట్టుబడులు పెట్టిన తుఫాన్ కారణంగా పంటలు నష్ట పోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
 ప్రభుత్వం ఆదుకోవాలి: ఆత్కూరి శ్రీకాంత్ సిపిఎం పార్టీ కాటారం మండల అధ్యక్షులు 
 మొంతా తుఫాన్ తో నష్టపోయిన  పత్తి, వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందని,పత్తి రైతులు,వరి రైతులు ఆరుగాలం శ్రమించిన తుఫాన్ ప్రభావంతో నీలమట్టం అయిందని ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -