Tuesday, September 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుయూరియా కోసం రైతుల పడిగాపులు

యూరియా కోసం రైతుల పడిగాపులు

- Advertisement -

నవతెలంగాణ – గండీడ్ 
రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యూరియా కొరత లేదు. ప్రతి రైతుకు అందిస్తాం అంటూ అధికారులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. ఒకవైపు పొలం పనులు చేసుకుంటూనే మరోవైపు ఎరువుల కోసం పరుగులు పెట్టాల్సిన దుస్థితి గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో నెలకొంది. మంగళవారం యూరియా వస్తుందన్న సమాచారంతో రైతన్నలు పెద్ద సంఖ్యలో గండీడ్, దేశాయిపల్లి ఎక్స్ రోడ్ ఉన్న దుకాణాల వద్ద ఉదయం నుండే ఆధార్ కార్డు జిరాక్స్ లతో పడిగాపులు కాస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వ్యవసాయ అధికారులు, షాపు యజమానులు యూరియా రావడానికి రాత్రి అవుతుందని బుధవారం ఉదయం రావాలని రైతులకు తెలియజేశారు. ఎన్ని రోజులు మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ.. షాపు యజమానులను నిలదీస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి యూరియా కష్టాల నుండి అన్నదాతలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -