Monday, March 9, 2026
E-PAPER
Homeఖమ్మంరైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించాలి

రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించాలి

- Advertisement -

ఆత్మ పథకం కింద రైతులకు శిక్షణ తరగతులు 
మధిర వ్యవసాయ ఏ డి ఏ స్వర్ణ విజయ్ చంద్ర
నవతెలంగాణ – బోనకల్ 

రైతులు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని మధిర వ్యవసాయ శాఖ ఏడిఏ స్వర్ణ విజయ్ చంద్ర రైతులకు సూచించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ మండల పరిధిలోని ముష్టికుంట్ల రైతు వేదికలో ఆత్మ పథకం కింద రైతులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతులు విచ్చలవిడిగా యూరియా వినియోగించటం వలన భూమి, నీరు, వాతావరణం కాలుష్యం అవుతుందని, దీని ఫలితంగా దిగుబడి తగ్గుతుందని అందువలన రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని కోరారు. వివిధ పంటలో ఎరువులు ఎప్పుడు వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి, నానో యూరియా, నానో డి ఏ పి వల్ల ఉపయోగాలను వివరించారు.

అధిక సాంద్రత, పత్తి వల్ల ఉపయోగాలు, నిషేధిత ప్రత్తి గురించి వివరించారు. మధిర ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను పాటించాలని కోరారు. ఎప్పుడు ఒకే రకమైన పద్ధతులు పాటించటం వలన అధిక దిగుబడి సాధించకపోగా నష్టాల బారిన పడవలసి వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఇఫ్కో కంపెనీ వారు డ్రోన్లు ఎలా ఉపయోగించాలో  డెమో వేసి రైతులకు అవగాహన కల్పించారు.

జిల్లా టీజీ రెడ్కో మేనేజర్ అజయ్ కుమార్ పీఎం కుసుమ్ పథకం కింద బోనకల్ మండలంలో 22 గ్రామాలు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆ గ్రామాలలో సుమారు ఆరు లక్షల రూపాయలు విలువైన సోలార్ పంప్ సెట్ లను ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఇస్తుందని, రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గ్రామ సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు పంటలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిగ దిగుబడి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పసునూరి వినయ్ కుమార్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు కందుల పాపారావు, నల్లమోతు సత్యనారాయణ, ఏఈవో బంధం త్రివేణి, ఇఫ్కో మేనేజర్ నాగార్జున, మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -