Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి

రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి

- Advertisement -

– వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్ 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు ఈనెల 13వ తేదీ లోపు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉప్లూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా  రైతు భీమాలో నామినీ పేరు మార్చుకోవడానికి కూడా దరఖాస్తు  చేసుకోవాలని ప్రకటనలో సూచించారు. జూన్ 5వ తేదీ నాటికి కొత్త పాసుబుక్ వచ్చిన రైతులు, ఇప్పటివరకు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోమని రైతులు మాత్రమే రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కొత్త పాస్ బుక్ వచ్చిన రైతులు మాత్రమే రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకునే రైతులు దరఖాస్తు ఫారం తో పాటు రైతు పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ ( తహసిల్దార్ తో డిజిటల్ సంతకం అయిన డిఎస్ పేపర్), రైతు ఆధార్ కార్డు జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ జత చేసి, సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందజేయాలని సూచించారు.14 ఆగస్టు1966 నుండి 14 ఆగస్టు 2007 మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే ఈ రైతు బీమాకు అర్హులని తెలిపారు. ఆధార్ కార్డులో 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల మధ్య వయసున్న రైతులు మాత్రమే బీమా చేసుకోవాలని ప్రకటనలో కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -