– రైతు సంఘం నాయకులు బుర్ర శేఖర్
నవతెలంగాణ-మర్రిగూడ: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి,వరి పంటలను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం అందించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర శేఖర్ అన్నారు. శనివారం స్థానికంగా ఆయన మాట్లాడారు.సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన నేటికీ కొనుగోలు జరగటం లేదని తడిసిన పంటలకు తేమశాతం పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.పత్తి పంటకు ఎకరానికి 50 వేలు, వరికి 35 వేల పెట్టుబడి వస్తుందని, దానికి తోడు అకాల వర్షాల కారణంగా దిగుబడి శాతం తగ్గడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ఆలోచన చేసి పంటలను నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాల మీదుగా వెళ్లే బస్సు రాకపోకలు ఆగిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆగిపోయిన బస్సు సౌకర్యాలను పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
రైతులకు నష్టపరిహారం అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



