మండల టాస్క్ ఫోర్స్ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన
మండల వ్యవసాయ అధికారి ఎస్కే యాస్మిన్
నవతెలంగాణ – నెల్లికుదురు
రైతులు నానో యూరియాను వాడే విధంగా ప్రోత్సహించాలని మండల వ్యవసాయ అధికారి ఎస్ కే యాస్మిన్, తాసిల్దార్ చందా నరేష్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో ప్రైవేటు ఆగ్రో రైతు సేవ కేంద్రాలు కు శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ రైతులను మోసగించేందుకు అధిక ధరలు కానీ లేదా వచ్చినటువంటి యూరియాను దాచిపెట్టి పరిస్థితి చేస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు.
మండల టాస్క్ఫోర్స్ టీమ్ ఆధ్వర్యం లో మండలం లో నీ ప్రైవేట్, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు మరియు పాక్స్ సీఈవో ల కి సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఫెర్టిలైజర్ డీలర్స్ యూరియా స్టాక్ వచ్చినే వెంటనే మండల వ్యవసాయ అధికారి కి సమాచారం ఇవ్వాలని సంబంధిత క్లస్టర్ ఏఈఓ ద్వారా టోకెన్లు ఇచ్చిన రైతుల కి మాత్రమే యూరియా బస్తాలు ఇవ్వాలని అదేవిధంగా యూరియా అధిక ధరకు అమ్మిన కృతిమ కొరత సృష్టించినా ఆ సంబంధిత డీలర్స్ యొక్క లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిపారు. రైతులు కి నానో యూరియా మీద అవగాహన కల్పించి రైతులు నానో యూరియా వాడే విధంగా ప్రోత్సహించాలని సూచన చేశారు. డీలర్స్ స్టాక్ రిజిస్టరు మరియు స్టాక్ బోర్డు లను ప్రతిరోజూ అప్డేట్ చేయాలని అదేవిందగా ఎరువులు తీసుకున్న రైతులకు తప్పని సరి బిల్లును ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్ ఆగ్రోస్ నిర్వాహకులు పాల్గొన్నారు.