ఆ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వంగాల రవీందర్
నవతెలంగాణ – నెల్లికుదురు
కూరగాయల సాగుతో రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకర్షక్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వంగాల రవీందర్ అన్నారు. కూరగాయల సాగు చేసే లబ్ధిదారులకు నారను అందించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా ప్రైమర్క్ కాటన్ ప్రాజెక్ట్ వారి సహకారంతో పత్తి సాగు చేస్తున్న మహిళా రైతులకు మహబూబాద్ జిల్లా ఉద్యానవన శాఖ వారి సౌజన్యంతో హక్దర్షక్ సంస్థ వారి ఆధ్వర్యంలో నెల్లికుదురు మండలంలోని రామన్నగూడెం, రాజుల కొత్తపల్లి, చిన్న ముప్పారం, శ్రీరామగిరి గ్రామాలకు చెందిన సుమారు 20 మంది కూరగాయలు సాగు చేసే రైతులకు ఉచితంగా టమాటా, వంకాయ, పచ్చిమిర్చి నారును అందజేయడం జరిగింది.
ప్రధానంగా ప్రైమర్క్ కాటన్ ప్రాజెక్టు సూచన మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం కోసం రైతుల అభివృద్ధి కోసం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి లబ్ధి పొందే విధంగా చేయాలని ఉద్దేశంతో 4000 మంది మహిళా రైతులతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది అని తెలిపారు. దానిలో భాగంగా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ఆధార్ బ్యాంకు సీడింగ్ ఉద్యానవన శాఖ వారి సౌజన్యంతో ఉచిత కూరగాయల నారు పంపిణీ లాంటి కార్యక్రమాలు మండలంలో చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వంగాల రవీందర్ మరియు హెచ్ డి చీకటి సంధ్యారాణి, సూరబోయిన ఉష, లబ్ధిదారులు బండి రాధిక, పాశం సుభద్ర, ఆవారి సరిత, గండ్ల మమత, బండి శ్రీనివాస్, లక్కాకుల దేవయ్య, తూటి మాధవి, మహమ్మద్ అమేధ, మరియు గుగులోతు రాజన్న, గుగులోతు హరిలాల్, లక్ష్మి తోపాటు కొంతమంది పాల్గొన్నారు.



