Tuesday, November 11, 2025
E-PAPER
Homeజిల్లాలురైతుకు సకాలంలో డబ్బులు అందించాలి 

రైతుకు సకాలంలో డబ్బులు అందించాలి 

- Advertisement -

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి 

వడ్లు అమ్మిన రైతుకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామం చేనేత కార్మికుల కాలనీలో ఐ.కే.పి ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని, మోజర్ల గ్రామంలోని వారాహి రైస్ మిల్లును కలెక్టర్ సందర్శించారు. రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చాక నిబంధనల ప్రకారం తేమ, తాలు చూసుకొని వెంటనే తూకం చేయాలని సూచించారు. అంతేకాకుండా రైతులు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని వివరాలు సేకరించి రైస్ మిల్లు నుండి త్వరగా ట్రక్ షీట్ తెప్పించుకొని వాటి ఆధారంగా రైతుకు సంబంధించిన ధాన్యం వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసి త్వరగా డబ్బులు అకౌంట్ లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో రైతుకు సంబంధించిన ధాన్యం వివరాలు ఆన్లైన్ లో ఏవిధంగా అప్లోడ్ చేస్తున్నారో పరిశీలించారు. రైతులకు నాణ్యమైన ధాన్యం విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు. 

అనంతరం మోజర్ల వారాహి రైస్ మిల్లు ను సందర్శించిన కలెక్టర్ రైస్ మిల్లులో ధాన్యం దించుకుంటున్న విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలోనే అన్ని ప్రమాణాలు పరిశీలించి నాణ్యమైన ధాన్యాన్ని మిల్లుకు పంపిస్తున్నందున వెంటనే ధాన్యం దించుకొని ట్రక్ షీట్ వెంటనే కొనుగోలు కేంద్రానికి పంపించాలని సూచించారు. ట్రక్ షీట్ త్వరగా పంపడం వల్ల రైతు అమ్మిన ధాన్యం వివరాలు త్వరగా ఆన్లైన్ లో అప్లోడ్ చేసి వెంటనే డబ్బులు రైతు ఖాతాలో జమ అయ్యే విధంగా సులువవుతుందన్నారు. ధాన్యం దించుకున్నాక వెంటనే ట్రక్ షీట్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అందేవిధంగా చూడాలని, అవసరం అనుకుంటే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసుకుని వాట్సాప్ ద్వారా పంపించాలని ఆదేశించారు. ధాన్యం మిల్లింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ మిల్లింగ్ ఆడించి త్వరగా ఎఫ్.సి. ఐ. కి అప్పగించాలని యజమానిని ఆదేశించారు. సాటెక్స్ పెట్టారా లేదా అని పరిశీలించారు. సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, పి.డి. డీఆర్డీఓ ఉమా దేవి, పెద్దమందడి తహసిల్దార్ పాండు నాయక్, మండల వ్యవసాయ అధికారి, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -