Sunday, September 21, 2025
E-PAPER
Homeజిల్లాలురైతులకు సరిపడా యూరియాను అందించాలిం: సీపీఐ(ఎం)

రైతులకు సరిపడా యూరియాను అందించాలిం: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
రైతులకు సరిపడా యూరియాను తక్షణమే ప్రభుత్వాలు అందించాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో నేతలు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు మాట్లాడుతూ, “విత్తనాలు వేసిన రైతులకు యూరియా కొరత తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం సరిపడా యూరియాను అందించి రైతాంగాన్ని ఆదుకోవాలి” అని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కేసు మల్ల సైదులు, డివైఎఫ్ఐ నాయకులు మాచర్ల చంద్రు, నరేష్, సాయిబాబు, రైతులు గెలువయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -