నవతెలంగాణ – తిమ్మాజిపేట
రైతులకు అన్ని రకాల సేంద్రియ ఎరువులు పురుగుల మందులు నాణ్యమైనవి అందించాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. ఆదివారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో మన గ్రోమోర్ సెంటర్ ను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా నిర్వహించి కొనుగోలు ప్రారంభించారు. సేంద్రియ ఎరువులు పురుగుల మందులు అన్ని రకాల ఎరువులు అన్ని రకాల పనిముట్లు రైతులకు అందుబాటులో ఉన్నాయని త్వరలో డ్రోన్ స్ప్రేయర్స్ రానున్నట్లు మన గ్రోమోర్ ఏరియా మేనేజర్ జె వివిఎస్ ప్రసాద్ ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో విండో ఉపాధ్యక్షులు రాందేవ్ రెడ్డి పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి నాయకులు మల్లయ్య గౌడ్, దేవస్వామి, ముబారక్, రావుఫ్, భాస్కర్, రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మాధవ్, నాగసాయిలు, సురేందర్, తదితరులు వున్నారు.
రైతులకు నాణ్యమైన ఎరువులను అందించాలి: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES