Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు సరిపడా యూరియా అందించాలి..

రైతులకు సరిపడా యూరియా అందించాలి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
రైతులకు యూరియాను సరఫరా చేయాలని, వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం  సిపిఐ భువనగిరి మండల సమితి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు కల్వర్టులు వెంటనే  మరమ్మత్తులు చేపట్టాలన్నారు.

రైతులకు యూరియాను అందించడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాల వలన ముఖ్యంగా పత్తి వరి వాణిజ్య పంటలు నష్టం జరిగాయని వెంటనే సంబంధిత అధికారులు సర్వే చేసి రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. వర్షాల వలన రోడ్లు ముఖ్యంగా హనుమాపురం వెళ్లే రైల్వే బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిన్నదని బస్వాపురం ఉసిరిలే వర్రె వాగుపై అలాగే నాగిరెడ్డిపల్లి ప్రధాన రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

అనంతరం డిప్యూటీ తహసిల్దార్ ప్రణయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్,  ఎండి ఇమ్రాన్, సిపిఐ మండల కార్యదర్శి దాసరి లక్ష్మయ్య, సహాయ కార్యదర్శి ఉడుత రాఘవులు, పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, నాయకులు చొప్పరి సత్తయ్య, ముదిగొండ ఠాగూర్, ఘనబోయిన వెంకటేష్,  నాగపురి యాదగిరి, కూరాకుల అబ్బులు, ముడుగుల ఉప్పలయ్య, బండిరాళ్ల వెంకటేశం, భాగ్యమ్మ  పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -