Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రైతులకు యూరియా కష్టాలు తీర్చాలి.. 

రైతులకు యూరియా కష్టాలు తీర్చాలి.. 

- Advertisement -

మాజీ మంత్రి దయాకర్ రావు 
నవతెలంగాణ – పాలకుర్తి

రైతులకు యూరియా కష్టాలు తీరే విధంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో గల పాలకుర్తి తొర్రూర్ సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరడంతో మాజీ మత్రి దయాకర్ రావు రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు సకాలంలో యూరియా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని తెలిపారు. అనంతరం మండలంలోని బిఖ్యానాయక్ పెద్ద తండాకు చెందిన గుగులోతు ద్వాళి మృతి చెందడంతో మృతురాలి పార్థివ దేహం పై పూలమాలవేసి నివాళులు అర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad