- Advertisement -
- జిల్లా ఉద్యానవన అధికారి ఎంఏ అక్బర్
- నవతెలంగాణ – అలంపూర్
ఆయిల్ ఫామ్ సాగులో రైతులు ముందుకు రావాలని జిల్లా ఉద్యానవన అధికారి ఎంఏ అక్బర్ రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం అలంపూర్ మండల పరిధిలోని క్యాతూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం( సింగిల్ విండో)ఆధ్వర్యంలో ఉద్యానవన శాఖ, తెలంగాణ ఆయిల్ ఫెడ్ సౌజన్యంతో ఆయిల్ పామ్ సాగు పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన అధికారి ఎంఏ అక్బర్ మాట్లాడుతూ పామాయిల్ కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు విదేశీ మాదకద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నందున దాన్ని తగ్గించుటకు ఆయిల్ ఫామ్ సాగుపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయని అన్నారు. రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ శాతం సబ్సిడీతో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. - రైతులు పంట సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారని, ఆయిల్ ఫామ్ సాగులో కలిగే ఇబ్బందులను ఎప్పటికప్పుడు రైతులకు ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్లు సలహాలు, సూచనలు అందిస్తున్నారని తెలిపారు. కొత్తగా ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశములో ఆయిల్ ఫెడ్ మేనేజర్ శివ నాగిరెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ రాఘవ రెడ్డి, జిల్లా సహకార ఆడిటర్ యశోద, మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి, ఉద్యాన అధికారి ఇమ్రాన్, ఫీల్డ్ ఆఫీసర్ త్రివిక్రమ్, సీఈఓ హుస్సేన్ పీరా, విస్తరణ అధికారి మానస, సింగిల్ విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



