Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు పంట మార్పిడి వైపు ఆలోచాలి

రైతులు పంట మార్పిడి వైపు ఆలోచాలి

- Advertisement -

పామాయిల్ సాగును చేపట్టి లాభాలు ఆర్జించాలి
వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి 

రైతులకు దీర్ఘకాలంగా లాభాలను ఆర్జించిపెట్టే పామాయిల్ సాగుపై అవగాహన కల్పించి జిల్లాలో పామాయిల్ సాగు పెంచే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వనపర్తి జిల్లాలో ఈ సంవత్సరం పామాయి సాగు లక్ష్యం 3 వేల ఎకరాలు సాధించే విధంగా రైతులకు ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ సంవత్సరంలో ఆయిల్ మిల్ కంపెనీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఒకసారి సాగు చేస్తే రైతులకు దీర్ఘ కాలం 30-40 సంవత్సరాల వరకు లాభాలను ఆర్జించిపెట్టే పామాయిల్ సాగు వైపు రైతులను మళ్లించాలన్నారు.

ఇందుకు ఒక్కో వ్యవసాయ విస్తీర్ణాధికారుకి 20 మంది రైతులను ప్రోత్సహించే విధంగా లక్ష్యాలను నిర్దేశించారు. ఉద్యాన శాఖ అధికారులకు ఒక్కొక్కరికి వంద మంది రైతులు పామాయిల్ సాగు చేసే విధంగా చూసేందుకు లక్ష్యాలను నిర్దేశించారు. సబ్సిడీ పై పామాయిల్ మొక్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, ప్రియునిక్ కంపెనీ వారితో సమన్వయం చేసుకొని అన్ని రైతు వేదికల్లో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారి విజయ్ భాస్కర్, వ్యవసాయ అధికారి ఆంజనేయులు, సివిల్ సప్లై అధికారి కాశి విశ్వనాథ్, కో ఆపరేటివ్ అధికారి బి. రాణి, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -