Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు పాడి సంపదను పెంచాలి: డా. శివరాజ్ 

రైతులు పాడి సంపదను పెంచాలి: డా. శివరాజ్ 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతులు వ్యవసాయంతో పాటు పాడి సంపదను పెంచాలని ప్రభుత్వం అందిస్తున్న సస్పిడిని రైతుల సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అనుప శివరాజ్ రైతులకు సూచించారు. పశువులకు వైద్య పరీక్షల కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని  వాడ్యాల్ గ్రామంలో గర్భకోశ వ్యాధి నివారణ పరీక్షలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ శివరాజ్ మాట్లాడారు.

మూగజీవాలకు సీజన్లో వచ్చే వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సస్పిడిపై   గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 42 పాడి పశువులకు చికిత్సలు నిర్వహించి మందుల పంపిణీ పంపిణీ చేశారు. 13 దూడలకు నట్టల నివారణ మందులు వేయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, డాక్టర్ సింధుజ, గోపాలమిత్ర సూపర్వైజర్ రవి, వైద్య సిబ్బంది శ్రీనివాస్, సత్యం గోపాల మిత్రులు రామకృష్ణ యాదగిరి నరసింహులు మల్లేష్ వేణుగోపాల్ పాడి రైతులు యాదయ్య, వెంకటయ్య, రజాక్, ఉదయ్ కుమార్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -