ఎమ్మెల్యే వేముల వీరేశం
నవతెలంగాణ – కట్టంగూర్
రైతులు నూనె గింజల ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వేరుశనగ విత్తనాల ను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. మంగళవారం మండలంలోని ఐటిపాముల గ్రామంలో రైతు వేదికలో జాతీయ నూనె గింజల ఉత్పత్తి ప్రోత్సాహక పథకంలో భాగంగా రైతులకు 100% సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను ఆయన అందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వేరుశెనగ విత్తనాలను తీసుకొని సాగు చేస్తున్న రైతులు వ్యవసాయ శాఖ వారి సూచనలు పాటించి అధిక దిగుబడులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి గుత్తా మంజుల, నకిరేకల్ ఏడిఏ ఎండి జానీమియా, తహసిల్దార్ పుష్పలత, మండల వ్యవసాయ అధికారి గిరిప్రసాద్,మాజీ జెడ్పిటిసిలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, నాయకులు పెద్ది చుక్కయ్య, రెడ్డిపల్లి సాగర్, ఎడ్ల పెద్దరాములు, వెంకట్ రెడ్డి, లింగయ్య ఏఈ ఓ లు రమణ,పరశురాం, నవీన్ ఉన్నారు.
రైతులు నూనె గింజల ఉత్పత్తిని పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES